ట్యాంకర్ ఢీకొట్టింది.. ఆర్టీసీ బస్సు కింద పడి చనిపోయింది.. భరత్ నగర్ ఫ్లైఓవర్పై యాక్సిడెంట్

ట్యాంకర్ ఢీకొట్టింది.. ఆర్టీసీ బస్సు కింద పడి చనిపోయింది.. భరత్ నగర్ ఫ్లైఓవర్పై యాక్సిడెంట్

విధి రాత విచిత్రంగా ఉంటుంది.. ఎవరూ ఊహించలేరు.. ఎప్పుడు ఎలా జరుగుతుందో.. ఏ క్షణానికి ఎలాంటి మార్పు వస్తుందో అస్సలు చెప్పలేరు.. హైదరాబాద్ సిటీ నడి బొడ్డున ఉన్న.. మన అందరికీ తెలిసిన భరత్ నగర్ ఫ్లై ఓవర్ పై జరిగిన యాక్సిడెంట్ చూస్తే అందరూ ఇలాగే అనుకుంటున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

కూకట్ పల్లిలో నివాసం ఉంటూ.. ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్న యువతి.. తన స్కూటీపై.. జనవరి 18వ తేదీ గురువారం ఉదయం డ్యూటీకి వెళుతుంది. కూకట్ పల్లి నుంచి వెళుతూ భరత్ నగర్ ఫ్లై ఓవర్ ఎక్కింది. ఆ సమయంలో ఆ యువతి స్కూటీని.. వెనక నుంచి వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. అప్పటికీ ఏమీ కాలేదు.. ట్యాంకర్ ఢీకొట్టిన సమయంలో రోడ్డుపై పడిపోయింది.. అదే సమయంలో ఆ పక్కనే వస్తున్న ఆర్టీసీ బస్సు.. ఆ యువతి పైనుంచి వెళ్లింది. స్పాట్ లోనే చనిపోయింది ఆ యువతి.

వాటర్ ట్యాంకర్ వెనక నుంచి ఢీకొట్టినా.. ప్రాణాలతో బయటపడిన ఆ స్కూటీ యువతి.. ఆ పక్కనే వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడి చనిపోవటం చూస్తుంటే.. విధి ఎలా ఆడుతుంది.. విధిరాతను ఎవరూ తప్పించలేరు అనిపిస్తుంది. ఓ వాహన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ యువతి.. మరో వాహనం కింద పడి చనిపోవటం.. మిగతా వాహనదారులను సైతం విస్మయానికి, ఆవేదనకు గురి చేసింది. 

ఆ యువతిది కర్నూలు జిల్లా శ్రీశైలంకు చెందిన పిట్టల వెంకటస్వామి కూతురు సునీత(26) అని తెలుస్తుంది. ఉద్యోగం కోసం.. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. కూకట్ పల్లిలో నివాసం ఉంటుంది. ఘటనా స్థలానికి చేరుకున్న సనత్ నగర్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.