హైదరాబాద్, వెలుగు: టెన్త్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 580కిపైగా మార్కులను 203 మంది, 570కిపైగా 434 మంది, 550కిపైగా 974 మంది, 500కిపైగా మార్కులను 1,934 మంది విద్యార్థులు సాధించారని విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ తెలిపారు. బుధవారం ఎస్ఆర్‌నగర్‌లోని భాష్యం క్యాంపస్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో సాకేత్ రామ్ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పి. శ్రుతి 600 మార్కులకు 595, ఆర్. గుణసాయి శరణ్ రెడ్డి 595, వీఎస్ఎన్ శరజ్ఞ 594, కేఎల్‌డీవీ అనురాధ 594, కె. హనీషా 594 మార్కులు సాధించారని తెలిపారు. భాష్యం విద్యార్థుల యావరేజ్ మార్కులు 520గా నమోదయ్యాయని చెప్పారు. సబ్జెక్టుల వారీగా చూస్తే మ్యాథ్స్‌లో 90కంటే ఎక్కువ మార్కులు 1500 మంది, సైన్స్‌లో 1,331 మంది సాధించారని వెల్లడించారు. టాప్ స్కోర్లు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, హైదరాబాద్ సీఈఓ చైతన్య ప్రత్యేకంగా అభినందించారు.

