కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి.. పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో భట్టి, పొన్నం

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి..  పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో భట్టి, పొన్నం

హైదరాబాద్, వెలుగు: పుదుచ్చేరిలో  కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే హమీల అమలుకు  కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడి ఓటర్లకు హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం పుదుచ్చేరిలోని మనవేలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి అనంత రామన్ కు మద్దతుగా రోడ్డు షో నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురండి.. పుదుచ్చేరిని రక్షించండి అంటూ డిప్యూటీ సీఎం భట్టి అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్, డీఎంకే పార్టీలతో కూడిన ఎస్పీఏ కూటమి ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందన్నారు. ఈ కూటమిపై ఎన్డీయే కూటమి చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు నమ్మవద్దని కోరారు. తెలంగాణలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, ఇక్కడ కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే అదే విధంగా ప్రతి వాగ్ధానాన్ని అమలు చేసి చూపిస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పుదుచ్చేరి భవిష్యత్ ఇక్కడి ఓటర్ల చేతిలో ఉందని, కాంగ్రెస్ కూటమి  ద్వారానే ఈ ప్రాంతాన్ని  అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు.