సీఎల్పీ నేతను హైకమాండ్​ ప్రకటిస్తది: భట్టి

సీఎల్పీ నేతను హైకమాండ్​ ప్రకటిస్తది: భట్టి

హైదరాబాద్, వెలుగు : సీఎల్పీ లీడర్​ ఎన్నికను పార్టీ అధిష్టానానికే అప్పగించామని భట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఏకవాక్య తీర్మానం చేశామని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. పార్టీ అధిష్టానమే సీఎల్పీ నాయకుడిని ప్రకటిస్తుందని తెలిపారు. ప్రస్తుతం వస్తున్న వివిధ కథనాలు ఊహాగానాలు మాత్రమేనని, వాటిని నమ్మొద్దని భట్టి విక్రమార్క కోరారు.