పోటీ పరీక్షలకు ప్రభుత్వం ఫ్రీ కోచింగ్ : డిప్యూటీ సీఎం భట్టి

పోటీ పరీక్షలకు ప్రభుత్వం ఫ్రీ కోచింగ్ : డిప్యూటీ సీఎం భట్టి
  • డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు  
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్​: రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడతూ 15 రోజుల్లో  19 నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా నిపుణులైన లెక్చరర్లతో  కోచింగ్​ ప్రారంభిస్తామన్నారు.  ప్రశ్నాపత్రాలు లీకులు లేకుండా పారదర్శకంగా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. 

ALSO READ :- శత్రువును కూడా పార్టీలో చేర్చుకున్న జగన్..!

బడ్జెట్ పెట్టే సమయంలో పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలన్నీ గుర్తుచేసుకొని కేటాయింపులు చేశానన్నారు.  డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, నాటి నుంచి డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. త్వరలోనే వడ్డీ మాఫీ చెక్కులను అందించేందుకు భారీ సభ నిర్వహించాలని నిర్ణయించిందని చెప్పారు. మహిళలను మహాలక్ష్మిలుగా చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.  మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహించే మహిళలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు బకాయి లేకుండా ప్రతినెల వేతనాలు చెల్లిస్తున్నామని భట్టి తెలిపారు.