హుబ్లీ ఎక్స్‌‌‌‌ప్రెస్ హాల్టింగ్పై హర్షం

హుబ్లీ ఎక్స్‌‌‌‌ప్రెస్ హాల్టింగ్పై హర్షం

తాండూర్, వెలుగు: తాండూరు నియోజకవర్గంలోని నవాంద్గి రైల్వే స్టేషన్​లో హుబ్లీ ఎక్స్​ప్రెస్ హాల్టింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కావడంపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

పార్లమెంట్​లో తాను లేవనెత్తిన అంశంపై కేంద్రం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ఆయన నవాంద్గి నుంచి తాండూరు వరకు రైలులో ప్రయాణించారు.