ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా కె. హరిత

ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా కె. హరిత
  • యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం సీఎస్​ కె.రామకృష్ణారావు జీవో జారీ చేశారు. గవర్నర్ జాయింట్ సెక్రటరీగా ఉన్న భవానీ శంకర్‌‌‌‌‌‌‌‌ను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో గా నియమించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా ఇప్పటివరకు ఉన్న వెంకటేశ్ దోత్రేను బదిలీ చేశారు.

ఆయన స్థానంలో 2013వ బ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌  అధికారి, ఆర్థిక శాఖలో స్పెషల్ సెక్రటరీగా ఉన్న కె. హరితను నియమించారు. వెంకటేశ్ దోత్రే ను  విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ జాయింట్ డైరెక్టర్ జనరల్‌‌‌‌‌‌‌‌గా ఉన్న నిఖిలను మత్స్యశాఖ  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా నియమించారు. ఆమె తెలంగాణ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ సీఈవోగా కూడా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు.