తెలంగాణ కలం, గళం, మాండలికంతో..‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

తెలంగాణ కలం, గళం, మాండలికంతో..‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

శర్వానంద్‌‌‌‌‌‌‌‌ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘భోగి’. కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేసిన మేకర్స్.. మ్యూజికల్ ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేశారు. ‘ఏగిలివారంగ..’ అనే పాటను శుక్రవారం విడుదల చేశారు. 1960 నాటి మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దులోని బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఆ గ్రామీణ  జీవితాన్ని ప్రతిబింబిస్తూ జానపద శైలిలో సాగిన ఈ పాటను భీమ్స్‌‌‌‌‌‌‌‌ సిసిరోలియో కంపోజ్ చేశారు.

‘‘ఎగిలి వారంగా లేసి,  ఇల్లలికి పూధిచ్చి,  దేగుట్ల దేవతలకు దీపాలు ముట్టించి,  కొట్టంలో బర్లు గొడ్లకు కుడితినే దాపించి,  పజ్జొన్న గటకలోకి సల్లానీళ్లే పోసి,  బుత్తంతా నోట్లోబెట్టి కడుమాది సద్ది గట్టి, సెలకల్లో తొవ్వబట్టి..” అంటూ ఆస్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్రబోస్‌‌‌‌‌‌‌‌ లిరిక్స్ రాశారు. నల్గొండ గద్దర్ నర్సన్న గ‌‌‌‌‌‌‌‌ళం ఈ పాటలోని సాహిత్యానికి సహజత్వాన్ని తీసుకొచ్చింది.  ఆయనతోపాటు నర్సిరెడ్డి, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ గళం కలిపారు.

ఒకప్పటి ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని గ్రామీణ జీవితాలను, సంస్కృతి సంప్రదాయాలతో పాటు కులవృత్తులు, భూస్వాముల పెత్తనం లాంటి అంశాలను ఈ పాటలో ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది.  శర్వానంద్, అనుపమ సహా నటీనటులంతా డీ గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించారు.  న‌‌‌‌‌‌‌‌వంబ‌‌‌‌‌‌‌‌ర్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.