ప్రజా భవన్​లో ఘనంగా బోనాలు

ప్రజా భవన్​లో ఘనంగా బోనాలు
  • ప్రత్యేక పూజలు చేసిన సీఎం, మంత్రులు

హైదరాబాద్, వెలుగు : ప్రజా భవన్ లోని నల్ల పోచమ్మ టెంపులో ఘనంగా బోనాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అమ్మవారి విగ్రహాన్ని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బయటకు తీసుకొచ్చారు.

ప్రత్యేకంగా అలకరించిన నల్ల పోచమ్మ టెంపుల్​లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, మంత్రి కొండా సురేఖ, మహిళా ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, పర్ణికా రెడ్డి, యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డి, మహిళ కాంగ్రెస్ నేత నేరేళ్ల శారద బోనం ఎత్తుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో పోతరాజులు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి.