జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో మంటలు

జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో మంటలు

డిసెంబర్ 7 తెల్లవారుజామున ఒడిశాలోని కటక్ స్టేషన్‌లో ప్రయాణికులు ప్రయాణిస్తున్న భువనేశ్వర్-హౌరా జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో స్వల్ప మంటలు చెలరేగాయి. రైలు కోచ్ బ్రేక్ షూ నుంచి పొగలు రావడంతో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత రైలు తిరిగి ప్రయాణాన్ని కొనసాగించింది.
 
డిసెంబర్ 4న పశ్చిమ బెంగాల్‌లో రాధికపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పింది. ధూలియన్‌గంగ, బల్లాల్‌పూర్‌ స్టేషన్ల మధ్య వేకువ జామున ఒంటిగంట తర్వాత గంటలకు ఈ ఘటన జరిగింది. రైలు పట్టాలు తప్పగా.. ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బోగీల నుంచి ఇంజిన్‌ను వేరు చేసి మంటలను ఆర్పివేశారు.