శ్రీవాణి పేరు మార్చి చంద్రవాణి ట్రస్ట్ అని పెట్టండి: భూమన కరుణాకర్ రెడ్డి

శ్రీవాణి పేరు మార్చి చంద్రవాణి ట్రస్ట్ అని పెట్టండి: భూమన కరుణాకర్ రెడ్డి

శ్రీవాణి టికెట్ల విషయంలో జరుగుతున్న అవకతవకలపై స్పందించిన టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ్రీవాణి పేరు మార్చి చంద్రవాణి ట్రస్ట్ అని పేరు పెట్టండని ఎద్దేవా చేశారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో మాజీ సీఎం జగన్ హైందవ యజ్ఞం ప్రారంభించారని.. గత ప్రభుత్వంలో 4 వేల 111 దేవాలయాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. 2024 చంద్రబాబు అధికారం లోకి వచ్చాక ఆలయాలు నిర్మాణం నిలిచి పోయాయని అన్నారు.

శ్రీవాణి పథకంలో పారదర్శకత లోపించిందని...రాజకీయ ప్రయోజనాలు పెరిగిపోయాయని అన్నారు భూమన. పచ్చిగా తినడం పచ్చ చొక్కాలు వేసుకోవడం మీకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. భక్తులు ఇస్తున్న స్వామి నిధులు భక్షాలుగా మేస్తున్నారని..పచ్చ చొక్కాలు జేబుల్లో వెళ్ళేందుకు జీవో తీసుకు వచ్చారని అన్నారు. శ్రీవాణి టికెట్లను ట్రావెల్ ఏజెంట్, బ్రోకర్లు 15 వేలకు అమ్ముతున్నారని.. విజిలెన్స్ నివేదికలో చెన్నై పద్మావతి ట్రావెల్ ఏజెన్సీ పట్టుకున్నారని అన్నారు. దీని వెనుక టిటిడి చైర్మన్, తిరుపతికి చెందిన బోర్డు సభ్యుడు హస్తం ఉందని అన్నారు భూమన.

టిటిడి చైర్మన్ ట్రావెల్ క్లబ్ సంస్థకు చెన్నై పద్మావతి ట్రావెల్స్ కు సంబంధాలు ఉన్నాయని.. వెంకటేశ్వర స్వామి నిధులు లోకేష్ పాలు అవుతున్నాయని అన్నారు. శ్రీవాణి టికెట్ల టిడిపి ఆకు రౌడీలకు అందుతున్నాయని.. టెండర్లు లేకుండా నిధులు అంటే దోపిడి తీయడమేనని అన్నారు. చంద్రబాబు ఎల్లో మీడియా టీడీపీ కార్యకర్తలు ద్వారానే నిధులు పంపకాలు చేస్తున్నారని ఆరోపించారు భూమన.

స్వామివారి కానుకలు టిడిపి నాయకులు చేతుల్లోకి వెళ్ళడం విచారకరమని అన్నారు.మా పాలనలో  70శాతం, ఆర్.ఎస్.ఎస్. అనుబంధం సమరత సంస్థ ద్వారా నిర్మాణం చేశామని.. టీడీపీ అధికారంలోకి రాగానే  దీన్ని క్లోజ్ చేస్తామని చెప్పి కొనసాగిస్తున్నారని అన్నారు భూమన.

ఇదిలా ఉండగా.. శ్రీవాణి టికెట్ల బల్క్ బుకింగ్స్ పై ఆరా తీసింది టీటీడీ విజిలెన్స్. చెన్నైకి చెందిన ట్రావెల్ ఏజెన్సీ బల్క్ బుకింగ్ చేసినట్లు గుర్తించారు అధికారులు. పద్మావతి ట్రావెల్స్ అనే సంస్థ ఒకే ఫోన్ నంబర్ తో అత్యధిక శ్రీవాణి టికెట్లు పొందినట్లు గుర్తించారు అధికారులు. శ్రీవాణి టికెట్లను ట్రావెల్ ఏజెన్సీలు బ్లాక్ విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు అవకతవకలపై ఆరా తీస్తున్నారు.