
భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం అడవి సోమనపల్లి వద్ద బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న గోదావరిఖని డిపోకి చెందిన AP o1Y 2992 ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. గోదావరిఖని నుండి భూపాలపల్లి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 63 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.