
ఆసియా కప్ 2025లో భాగంగా అబుదాబి వేదికగా శ్రీలంతో జరుగుతోన్న మ్యాచులో బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఆదిలోనే ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో కేవలం రెండు పరుగులకే బంగ్లా రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. తంజిద్ హసన్ తమీమ్‌ను శ్రీలంక స్టార్ బౌలర్ నువాన్ తుషారా క్లీన్ బౌల్డ్ చేయగా.. మరో ఓపెనర్ పర్వేజ్ హుస్సేన్‌ను చమీరా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
దీంతో బంగ్లాదేశ్ రెండు పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులో కుదురుకుంటున్న తోహిద్ హృదోయ్ (8) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. పవర్ ప్లేలో నువాన్ తుషారా, చమీరా చెలరేగడంతో పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు బంగ్లా బ్యాటర్లు. పవర్ ప్లేలో 3 మూడు వికెట్ల నష్టానికి కేవలం 30 పరుగులు మాత్రమే చేసి శుభారంభం చేయలేకపోయింది బంగ్లా జట్టు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ లిటన్ దాస్ (18), మెహదీ హసన్ (4) ఉన్నారు. ఆరంభంలోనే పీకల్లోతూ కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్ ఆశలన్నీ కెప్టెన్ లిటన్ దాస్ పైనే ఉన్నాయి.
బంగ్లాదేశ్ స్క్వాడ్:
పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తాంజిద్ హసన్ తమీమ్, లిట్టన్ దాస్ (c & wk), తౌహిద్ హృదయ్, జాకర్ అలీ, షమీమ్ హొస్సేన్, మెహదీ హసన్, రిషద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సాకిబ్, షోరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్
శ్రీలంక స్క్వాడ్:
పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ (Wk), కమిల్ మిషార, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక (c), కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగా, దుష్మంత చమీర, మతీషా పతిరణ, నువాన్ తుషార