స్థానిక సంస్థల చరిత్రలోనే ఇది రికార్డ్ విజయం : కేటీఆర్

స్థానిక సంస్థల చరిత్రలోనే ఇది రికార్డ్ విజయం : కేటీఆర్

హైదరాబాద్ : దేశ చరిత్రలో, స్థానిక సంస్థల చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంత ఏకపక్ష తీర్పురాలేదన్నారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధకి స్థానాలతో విజయం సాధించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. టీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో ఎంత పటిష్టమైన పునాది ఉందో ఈ ఫలితాలే రుజువు చేస్తున్నాయని తెలిపారు.

రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నారని.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి విజయం అందించారో పరిషత్ ఎన్నికల్లో దాన్ని మించిన విజయాన్ని అందించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష తీర్పునిచ్చారని చెప్పారు.
వందశాతం జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోవడం ఇంతవరకు దేశంలో ఎక్కడా జరుగలేదన్న ఆయన.. ఇది చారిత్రక, అఖండ, అసాధారణ విజయమన్నారు. టీఆర్ఎస్ చరిత్రలో ఇది అతిపెద్ద విజయమని.. దేశంలో ఏ పార్టీ సాధించని ఘనత టీఆర్ఎస్ సాధించిందని కేటీఆర్ అన్నారు.

తెలంగాన ప్రజల చైతన్యానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విజయంలో కీలకపాత్ర పోషించిన టీఆర్ఎస్ శ్రేణులకు అభినందనలు తెలియజేశారు. ఆరు జిల్లాల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిందని.. మరో ఆరు జిల్లాల్లో విపక్షాలకు ఒక్కో స్థానం మాత్రమే దక్కిందని తెలిపారు. 32కు 32 జిల్లాల్లో జెడ్పీ పీఠాలను టీఆర్ఎస్ సొంతంగా కైవసం చేసుకుందని చెప్పిన కేటీఆర్.. ఓటు వేసిన ప్రజలందరికీ తలవంచి నమస్కరిస్తున్నానన్నారు. ఎన్నికల్లో కష్టపడ్డ జిల్లా పార్టీ ఇన్ ఛార్జిలకు అభినందనలు తెలిపారు కేటీఆర్.