Bigg Boss Today Promo: తొలిరోజే కంటెస్టెంట్ల మధ్య కొట్లాట..ప్రోమోతో షోపై పెరిగిన అంచనాలు

Bigg Boss Today Promo: తొలిరోజే కంటెస్టెంట్ల మధ్య కొట్లాట..ప్రోమోతో షోపై పెరిగిన అంచనాలు

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ (Bigg Boss Telugu 8) మొదలైంది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఆదివారం సెప్టెంబర్ 1 రాత్రి 7 గంటలకు ప్రారంభమైంది.ఈ ఈవెంట్ లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ అదిరింది. దేవర ఫియర్ సాంగ్‍కు డ్యాన్స్‌తో ఎంట్రీ ఇచ్చి..లిమిట్‍లెస్ అంటూ షోను మొదలుపెట్టేశారు.ఈ సీజన్ కోసం బిగ్‍బాస్  హౌస్ మొత్తం అడవి థీమ్‌లో ఉంది. జంవుతుల బొమ్మల థీమ్‍తో రూమ్‍లు, కొన్ని వస్తువులు ఉన్నాయి. బిగ్‍బాస్ హౌస్‍లోకి 14 మంది కంటెస్టెంట్లు వెళ్లారు. ఏడు జోడీలుగా ఉన్నారు. 

ప్రైజ్‍మనీ జీరో

8వ సీజన్ ప్రైజ్‍మనీ జీరో అంటూ కంటెస్టెంట్లకు షాక్ ఇచ్చారు బిగ్‍బాస్. అయితే, ఆట ఆడే కొద్ది అది పెరుగుతుందని అన్నారు. లిమిట్‍లెస్‍గా డబ్బు గెలిచే అవకాశం ఉందని చెప్పారు. కంటెస్టెంట్లు టాస్కులు చేసే కొద్దీ జీరో నుంచి ప్రైజ్‍మనీ పెరుగుతూ పోతుందని బిగ్‍బాస్ తెలిపారు.అలాగే బిగ్‌బాస్ 8వ సీజన్ మొత్తం కెప్టెన్ లేకుండానే షో కొనసాగుతుందని చెప్పి బిగ్‌బాస్ పెద్ద షాకిచ్చాడు. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా తొలిరోజే సోమవారం (సెప్టెంబర్ 2) బిగ్‌బాస్‌ హౌజ్ లో ఏం జరిగిందన్నది చెబుతూ స్టార్ మా ఓ ప్రోమో రిలీజ్ చేసింది.

బిగ్‌బాస్ ప్రోమో:

లేటెస్ట్గా రిలీజ్ చేసిన ప్రోమో ఆసక్తి రేపుతోంది. ఇందులో నిఖిల్,నాగ మణికంఠల మధ్య ఏదో గొడవ జరిగినట్టు చూపించారు. నాగ మణికంఠ మాట్లాడుతూ నీ వల్ల ఇష్యూ పెద్దది అవుతుందని చెబుతుండగా, నా వల్ల అయితే వదిలేయ్ అంటూ నిఖిల్ చెప్పడం ప్రోమోలో చూపించారు.ప్రోమో చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో పెద్ద గొడవ జరిగినట్టే కనిపిస్తోంది.

శేఖర్ బాషా వర్సెస్ సోనియా ఆకుల

అలాగే శేఖర్ బాషా, సోనియా ఆకుల మధ్య గొడవ గట్టిగానే జరిగినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. కిచెన్ లోని ఆరెంజ్ పండ్లను తీసుకొని క్యాచ్ లు పట్టుకుంటూ శేఖర్ ఆటాడుతుండటంపై సోనీ సీరియస్ అవుతుంది. ఎవరైతే ఆడుతున్నారో వాళ్లెవ్వరూ ఆరెంజెస్ ముట్టడానికి వీల్లేదు అంటూ వార్నింగ్ ఇస్తుంది.

దీనికి శేఖర్ బాషా కూడా సీరియస్ గానే స్పందిస్తూ సెటైర్ డైలాగ్ విసురుతాడు. హౌజ్ లో ఉన్నవన్నీ అందరి ప్రాపర్టీ..నీ ఒక్కదానివే కాదంటూ వాదనకు దిగుతాడు. ఎవరైతే మనుషుల్లాగా తిందామని అనుకుంటున్నారో వాళ్లదాంట్లో అవి పెట్టకండి అని సోనీ మరోసారి సీరియస్ గా చెబుతుంది.. అప్పుడు ఆ పండు తింటూ అంటే నేను మనిషిని కాదా అని శేఖర్ బాషా అంటాడు.

దీంతో తొలిరోజు నుంచే బిగ్‌బాస్ తన అసలైన గేమ్ షురూ చేసినట్టు నెటిజన్స్ నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక ఎప్పటి మాదిరిగానే ఈ సీజన్ 8లో టీవీ సీరియల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కంటెస్టెంట్లను చూస్తే అర్థం అవుతోంది. ఏదేమైనా తాజాగా విడుదలైన ప్రోమోతో షోపై అంచనాలు మాత్రం రెట్టింపు అయ్యాయి.