పాట్నా: బిహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ (జన్ సురాజ్ పార్టీ) ప్రభావం పెద్దగా ఉండదని ఇండియా కూటమి సీఎం క్యాండిడేట్, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ అన్నారు. శుక్రవారం ఎన్డీటీవీకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ ఓట్లు, సీట్లు దక్కించుకునే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ‘‘మా పార్టీకి ఎవరు నష్టం చేస్తారు? ఎవరు సాయం చేస్తారు? అనేదే ఈ ప్రశ్న సారాంశం. ఆర్జేడీ చుట్టూ ఇలాంటివి అల్లుతూనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ మా ఓట్లను కొల్లగొడతారని వాదిస్తుంటారు. కానీ మేం అవన్నీ పట్టించుకోం. ఈసారి విజయం సాధించేది మేమే. తప్పకుండా సర్కార్ ఏర్పాటు చేస్తామనే నమ్మకం ఉంది. అప్పుడు బిహార్ మారిపోతుంది” అని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు.
