బిహార్‌‌‌‌లో డిఫెన్స్ కారిడార్.. ప్రతి జిల్లాలో ఫ్యాక్టరీలు.. ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్షా హామీలు

బిహార్‌‌‌‌లో డిఫెన్స్ కారిడార్..  ప్రతి జిల్లాలో ఫ్యాక్టరీలు.. ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్షా హామీలు
  • ఏన్డీయే అధికారంలోకి వస్తే వరదల నివారణ కమిషన్
  •  మిథిలాంచల్‌‌‌‌కు కోసీ నుంచి సాగునీరందిస్తామని వెల్లడి

షియోహర్: ఎన్‌‌‌‌డీయే అధికారంలోకి వస్తే బిహార్‌‌‌‌లో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రతి జిల్లాలో ఫ్యాక్టరీలు, ఎంఎస్ఎమ్‌‌‌‌ఈలు, పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రగుప్త మౌర్యుడు నుంచి మోదీ వరకు గండక్, కోసీ, గంగా నదులకు వరదలు వస్తున్నాయన్నారు. ఎన్‌‌‌‌డీయే  వస్తే వరదలు లేని బిహార్ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

మిథిలాంచల్‌‌‌‌లో 50 వేల హెక్టార్లకు కోసీ నది నుంచి సాగునీటిని అందిస్తామన్నారు. సోమవారం షియోహర్, సీతారామ్ (సీతామర్హి), మధుబనీలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీతారామ్–అయోధ్య మధ్య వందే భారత్ రైలు ప్రారంభిస్తామని షా చెప్పారు. పూనౌర ధామ్‌‌‌‌లో రూ.850 కోట్లతో సీతా ఆలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు.

 మిథిలాంచల్‌‌‌‌ను రూ.500 కోట్లతో ప్రపంచ జ్ఞాన కేంద్రంగా మారుస్తామన్నారు. పాట్నా, దర్భంగా, పూర్నియా, భాగల్‌‌‌‌పూర్ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. మోదీ  పదేండ్ల పాలనలో  బిహార్​కు రూ.18.70 లక్షల కోట్లు కేటాయించామని తెలిపారు.