బీహార్ ఎగ్జిట్ పోల్స్: ఎన్డీయే కూటమిదే అధికారమంటున్న పీపుల్స్ ఇన్ సైట్..

బీహార్ ఎగ్జిట్ పోల్స్: ఎన్డీయే కూటమిదే అధికారమంటున్న పీపుల్స్ ఇన్ సైట్..

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి.. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఎప్పుడు లేని విధంగా ఈసారి బీహార్ లో అత్యధికంగా 67.14 శాతం పోలింగ్ నమోదయ్యింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడతలో మంగళవారం ( నవంబర్ 11 ) భాగంగా 20 జిల్లాల్లో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎండ్ కార్డు పడింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అయితే.. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీహార్ లో ఈసారి ఎన్డీయే కూటమిదే అధికారమంటూ అంచనాలు వెల్లడించాయి. పీపుల్స్ ఇన్ సైట్ ఎగ్జిట్ పోల్స్ 133 నుంచి 148 సీట్లతో ఎన్డీయే కూటమి అధికారమని దక్కించుకుంటుందని.. మహాఘట్ బంధన్ 87 నుంచి 102 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది.

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ లో 133 నుంచి 159 సీట్లతో ఎన్డీయే కూటమి అధికారం దక్కించుకుంటుందని.. మహాఘట్ బంధన్ 75 నుంచి 101 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. 

బీహార్ ఎగ్జిట్ పోల్స్:

పీపుల్స్ ఇన్ సైట్:

  • NDA కూటమిదే అధికారమంటున్న పీపుల్స్ ఇన్ సైట్ 
  • NDA : 133  నుంచి 148 సీట్లు
  • మహాఘట్ బంధన్: 87 నుంచి 102
  • JSP : 0 నుంచి 2
  • ఇతరులు : 3 నుంచి 6 

పీపుల్స్ పల్స్:

  • NDA కూటమిదే అధికారమంటున్న పీపుల్స్ పల్స్
  • NDA: 133 నుంచి 159
  • మహాఘట్ బంధన్ : 75 నుంచి 101
  • JSP : 0 నుంచి 5
  • ఇతరులు: 2 నుంచి 8

పీ-మార్క్ ఎగ్జిట్ పోల్స్:

  • NDA: 142 నుంచి 162 సీట్లు
  • మహాఘట్ బంధన్: 80 నుంచి 98
  • JSP: 1 నుంచి 4
  • ఇతరులు: 0 నుంచి 3