యువకులపై కర్రలు,రాడ్లతో దాడి చేసిన బీహార్ గ్యాంగ్

V6 Velugu Posted on Jun 30, 2021

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో బీహార్ గ్యాంగ్ వీరంగం సృష్టించింది. రషీద్ గూడకి చెందిన యువకులపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడులకు దిగింది. దెబ్బలకు తట్టుకోలేక వాహనాలను వదిలేసి యువకులు పారిపోయారు. దీంతో బైకులను పూర్తిగా ద్వంసం చేసింది బిహార్ గ్యాంగ్. రషీద్ గూడకి చెందిన శివమణితో గ్రామంలోని కిరాణ షాప్ దగ్గర బీహార్ గ్యాంగ్ గొడవపడినట్లు తెలుస్తోంది. దీంతో.. శివమణి స్నేహితులతో కలిసి గొల్లపల్లి వెళ్లి వస్తుండగా.. గ్రామ శివారులో కాపు కాసి.. దాడి చేశారు బీహారీలు. మొత్తం ఏడుగురు బీహార్ వ్యక్తులు తమపై దాడి చేశారని యువకులు అంటున్నారు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికంగా ఉంటూ.. కాంపౌండ్ వాల్ పనులు చేస్తున్న బీహారీలే దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Tagged Shamshabad, sticks, rods, Bihar gang, attacke, youth

Latest Videos

Subscribe Now

More News