రెండు వర్గాల ఘర్షణ.. బిహార్​లో ఇంటర్నెట్​ బంద్

 రెండు వర్గాల ఘర్షణ.. బిహార్​లో ఇంటర్నెట్​ బంద్

బిహార్‌లోని బగాహా నగరంలో రెండు వర్గాల మధ్య మత ఘర్షణ జరిగిన ఒక రోజు తర్వాత, రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఆగస్టు 22నే ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాయి. 

ఆగస్టు 24  మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ బ్యాన్​ అమలులో ఉంటుంది. బీహార్‌లోని మోతిహారిలో మహావీరుల కవాతు సందర్భంగా హింస చెలరేగడంతో  జిల్లా మేజిస్ట్రేట్,  హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది . 

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే సందేశాలు, వీడియోలను ప్రసారం చేసేందుకు కొందరు  ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చనే భయాందోళనల నేపథ్యంలో ఇంటర్నెట్​ బ్యాన్​సరైన పరిష్కారంగా భావించినట్లు అధికారులు వెల్లడించారు.   

రెండు రోజుల క్రితం నాగపంచమి సందర్భంగా, రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ హింసకు దారి తీయడంతో 12 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను బగాహాలోని సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బగాహాతో పాటు, తూర్పు చంపారన్ జిల్లాలోని మెహ్సీ, కళ్యాణ్‌పూర్ గ్రామాల్లో కూడా ఘర్షణలు చెలరేగాయి.