ట్యాక్సీలు, బైకులు బుక్ చేసుకుంటున్నారా.. డ్రైవర్ ఏం చేశాడో చూడండి.. ఇలాంటోళ్లు కూడా ఉంటారు జాగ్రత్త..

ట్యాక్సీలు, బైకులు బుక్ చేసుకుంటున్నారా.. డ్రైవర్ ఏం చేశాడో చూడండి.. ఇలాంటోళ్లు కూడా ఉంటారు జాగ్రత్త..

సిటీల్లో ట్యాక్సీలు, కార్లు, బైకులు బుక్​ చేసుకోవడం సాధారణమైన విషయమే. ఓలా , రాపిడో, ఊబర్​ వంటి  యాప్​ ల ద్వారా రద్దీగా ఉండే సిటిల్లో ప్రయాణించేందుకు బైకులు, కార్లు బుక్​ చేసుకుంటాం. అయితే ఇది కొన్ని కొన్ని సార్లు ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా మహిళల విషయంలో.. ఇలా వాహనాలను బుక్​ చేసుకుని ప్రయాణించే సమయంలో టీజీంగ్ లైంగిక వేధింపులు వంటివి జరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. తమిళనాడులో బైక్​ను బుక్​ చేసుకున్న మహిళను డ్రైవర్​ వేధించడం.. ఈ అద్దె వాహనాలలో సేఫ్టీపై సందేహం కలుగుతోంది.. వివరాల్లోకి వెళితే.. 

సోమవారం ( అక్టోబర్​27)  చెన్నైలో మహిళను వేధించిన కేసులో ఓ బైక్​ ట్యాక్సీ డ్రైవర్​ గా పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని శివకుమార్​ గా గుర్తించిన పోలీసులు అతడిని కోర్టులో హాజరపర్చారు. మంగళవారం జ్యుడిషియల్​ కస్టడీకి పంపించారు. శివకుమార్ బైక్​ ను కూడా సీజ్​ చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని పక్కికరణైలో ఉన్న స్నేహితురాలి దగ్గరకు వెళ్లేందుకు 22 ఏళ్ల మహిళ బైక్​ ట్యాక్సీని బుక్​ చేసుకుంది. తనకు కేటాయించిన డ్రైవర్​ శివకుమార్​ ను తిరుగు ప్రయాణం కోసం వేచి ఉండమనిచెప్పింది. అదే ఆమె పాలిటి శాపంగా మారింది. 

తిరుగు ప్రయాణంలో ఎవరు లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెను బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం భర్తకు తెలపడంతో పోలీసులను ఆశ్రయించాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా  కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. దర్యాప్తు చేపట్టారు. 

తమిళనాడులో మహిళలపై లైంగిక నేరాలు పెరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రతిపక్షాల ఆరోపణలను రాష్ట్ర పోలీసులు ఖండించారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, కేసుల సత్వర న్యాయం కోసం విచారణలు వేగంగా జరుగుతున్నాయని చెబుతున్నారు.