మాదాపూర్, వెలుగు: మాదాపూర్పరిధిలో ఓ బైకర్, ట్రాఫిక్కానిస్టేబుల్ మధ్య వివాదం పోలీస్స్టేషన్వరకూ వెళ్లింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఓ వ్యక్తి తన బైక్‌పై భార్యతో కలిసి ఆవాస హోటల్ నుంచి సైబర్ టవర్స్వైపు వెళ్తున్నాడు. సిగ్నల్వద్ద మైండ్స్పేస్జంక్షన్ వైపు ఉన్న ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్చేశాడు. ఇది చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్అక్కడికి వచ్చి ముందుకు వెళ్లాలని సూచించాడు. అయితే, అతడు ట్రాఫిక్సిగ్నల్పడితే వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతో బండిని ముందుకు, వెనక్కి తీస్తూ అక్కడే ఉన్నాడు. తాను చెప్పినా వినడం లేదని సదరు ట్రాఫిక్కానిస్టేబుల్అతడి దగ్గరకు వచ్చి బైక్తాళాలు తీసుకున్నాడు.
తర్వాత టూ వీలర్‌ను పక్కకు తీయించాడు. తన భార్యతో అర్జంట్పనిపై వెళ్తుండగా అడ్డుకోవడం ఏమిటని, తన బైక్‌తో ఫ్రీ లెఫ్ట్ఏమీ బ్లాక్కావడం లేదని వాదించాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదం ముదిరి పోలీస్స్టేషన్వరకూ వెళ్లింది. డ్యూటీలో ఉన్న తనపై వాహనదారుడు దురుసుగా ప్రవర్తించాడని, అతడి భార్య కూడా తనను దుర్భాషలాడిందని కానిస్టేబుల్ మాదాపూర్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ జరుపుతున్నామని సీఐ కృష్ణమోహన్ తెలిపారు.
