సామాన్యులు, వికలాంగుల కోసం సరికొత్త సోలార్ కారు

సామాన్యులు, వికలాంగుల కోసం సరికొత్త సోలార్ కారు

వికలాంగులు, సామాన్యుల కోసం సరికొత్త సోలార్ కారు రాబోతోంది. కశ్మీర్‌లోని శ్రీనగర్ కు చెందిన బిలాల్ అహ్మద్ అనే ఇంజనీర్ ఈ సోలార్ కారును రూపొందించాడు. వికలాంగులు, సామాన్యుల కోసం ఏదైనా ఒక వాహనం తయారు చేయాలనుకున్నానని, అయితే.. సోలార్ కారు అయితే.. బాగుంటుందని ఆలోచించి దీనినే తయారు చేశానని చెప్పాడు. రాబోయే పదేళ్లలో చమురు ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో సోలార్ కారును తయారు చేశానని వివరించాడు.

దాదాపు 11 ఏళ్లు శ్రమించి సామాన్యులకు లగ్జరీ ఫీచర్లు ఉండే అధునాతన సోలార్ కారును రూపొందించాడు. ఈ కారు నడిచేందుకు పెట్రోలు, డీజిల్‌ లేకుండానే కేవలం సౌరశక్తితోనే నడుస్తుండడం విశేషం. బిలాల్ అహ్మద్ కు చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్‌ ఇండస్ట్రీపై ఆసక్తి ఎక్కువ. ముఖ్యంగా లగ్జరీ కార్లు, అందులో ఫీచర్లను ఎక్కువగా ఇష్టపడేవాడు. తనలాంటి సామాన్యులకు లగ్జరీ కార్లను అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఇంటర్నెట్‌లో వీడియోలను చూసి, మరికొంత సమాచారాన్ని సేకరించి.. సోలార్ కారును రూపొందించాడు. 11 ఏళ్ల శ్రమ ఫలించి ఇటీవల మోడిఫైడ్‌ లగ్జరీ ఫీచర్లతో కూడిన కారు అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్‌ ధరలో అధునాత కారు కోసం శ్రమించే క్రమంలో సోలార్‌ పవర్‌తో కారును తయారు చేసేందుకు బిలాల్‌ శ్రమించాడు. సౌర శక్తి కోసం కారుకు నలువైపులా సోలార్‌ ప్యానెళ్లు అమర్చాడు. పైకి తెరుచుకునే డోర్లు ఈ కారుకు కొత్త లుక్‌ తీసుకువచ్చాయి.