అంత టాలెంట్ ఏంటీ : మన గల్లీ కుర్రోడి ఛాయ్ దుకాణంలో బిల్ గేట్స్..

అంత టాలెంట్ ఏంటీ : మన గల్లీ కుర్రోడి ఛాయ్ దుకాణంలో బిల్ గేట్స్..

బిల్ గేట్స్ గురించి మనందరికి తెలుసు. మైక్రోసాఫ్ట్ సంస్థ  సహ వ్యవస్థాపకుడు. ప్రపంచంలోని టాప్ టెన్ బిలియనీర్స్ లో ఒకరు. పిలాంత్రోపిస్ట్ కూడా. ప్రస్తుతం బిల్ గేట్స్ ఇండియా పర్యటనలో ఉన్నారు. ఓ ఛాయ్ తాగాలనిపించడంతో బిల్ గేట్స్ కాన్పూర్ లోని ఫుట్ పాత్ పై టీ అమ్ముతున్న ఓ ఛాయ్ వాలా దగ్గరకు వెళ్లాడు. మంచి అల్లం ఛాయ్ తాగాడు. ఛాయ్ వాలా టీ చేసిన విధానం, అతని టాలెంట్ ను మెచ్చుకున్నారు. భారత్ పర్యటనలో తాను ఆస్వాదించిన ఛాయ్ ముచ్చట్లు చెబుతూ ఓ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు బిల్ గేట్స్.. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలోని ధనవంతులలో ఒకరు అయిన బిల్ గేట్స్ ఫుట్ పాత్ చాయ్ తాగడం.. ఈ విషయాన్ని  స్వయంగా వీడియో ద్వారా వెల్లడించడంతో ఆయన సింప్లిసిటీకి నెటిజన్ ఫిదా అయిపోయారు. 

ఇంతకీ బిల్ గేట్స్ ఇండియాకు ఎందుకు వచ్చారంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల గ్రాండ్ ప్రీ వెడ్డింగ్  వేడుకలకు వచ్చారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. మార్చి 1 నుంచి 3 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే సరదాగా అలా బయటకెళ్లిన బిల్ గేట్స్ వీధిలో చాయ్ తాగాలనిపించింది. 

ఈ పోస్టులో బిల్ గేట్స్.. భారత్ లో రోజువారీగా దొరికే టీ లాంటి ఉత్పత్తులపై తనకున్న అభిమానాన్ని  పంచుకున్నారు. భారత్ లో ప్రతి చోట ఓ ప్రత్యేక ఆవిష్కరణను కొనుగొనవచ్చు. సాధారణ కప్పు టీ తయారీలో కూడా ఓ అద్బుతం ఉంటుందని రాశారు. వీధిలోని చాయ్ దుకాణం.. డాలీ చాయ్ వాలా నుంచి ‘ఛాయ్ ప్లీజ్’ అంటూ బిల్ గేట్స్ అభ్యర్థిస్తున్న క్లిప్ తో ఈ వీడియో ప్రారంభమవుతుంది. 

ALSO READ :- Naga Babu: ఎవరైనా హర్ట్ అయుంటే క్షమించండి.. సారీ చెప్పిన మెగా బ్రదర్

బిల్ గేట్స్  ఓ గ్లాసు నుంచి వేడి చాయ్ ని స్విప్ చేస్తూ భారత్ కు వచ్చినందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.అద్భుతమైన జీవితాలను రక్షించే అద్భుతమైన ఆవిష్కరణలకు నిలయం అని అభివర్ణించాడు.  

ఈ వీడియో పోస్ట్ చేసినప్పటినుంచి మిలియన్ల కొద్ది నెటిజన్లు చూశారు. లైకులు, కామెంట్లతో ముంచెత్తారు.. మార్వెల్ కూడా ఊహించలేదని క్రాస్ ఓవర్ అని.. డాలీ చాయ్ వాలాను అదృష్ట వంతుడు అని పొగిడారు.