హైదరాబాద్, వెలుగు: భారతదేశంలో నేచురల్ ఫార్మింగ్(బయోలాజికల్ వ్యవసాయం) ను ప్రోత్సహించేందుకు బయో అగ్రి ఐదో ఎడిషన్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో బయోలాజికల్ అగ్రికల్చరల్ అండ్ బయోలాజి అసోసియేషన్ నిర్వహిస్తోంది. ఈ రెండు రోజుల సదస్సు బుధవారం ప్రారంభమైంది. 40కి పైగా కంపెనీల నుంచి 200కి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సదస్సులో బయోలాజికల్ ఇన్నోవేషన్, బయోటెక్నాలజీ, వాతావరణ ప్రతిస్పందన, మార్కెట్ ధోరణులపై ప్రత్యేక సెషన్లు జరుగుతాయి. అతిగా పెస్టిసైడ్ల వాడడంతో తెలంగాణ మిరప వంటి పంటలు ఎగుమతులకు అర్హత కోల్పోతున్నాయని నిపుణులన్నారు

