
హైదరాబాద్ సిటీ పరిధిలోని కుత్బుల్లాపూర్ లో జోరుగా అక్రమ బయోడీజిల్ దందా సాగుతోంది. శుక్రవారం (సెప్టెంబర్12) కుత్బుల్లాపూర్ సమీపంలోని బౌరంపేట దగ్గర అక్రమంగా బయో డీజిల్ ను ట్యాంకర్ల ద్వారా క్రషర్లకు అమ్ముతుండగా మేడ్చల్ ఎస్ వోటీ పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు నుంచి సూర్యాపేటకు వెళ్లాల్సిన బయోడీజిల్ ట్యాంకర్ దుండిగల్ కు మళ్లించి అధిక ధరలకు డీజిల్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.
బౌరంపేట దగ్గర డీజిల్ ట్యాంకర్ నుంచి డీజిల్ అన్ లోడ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ డీజిల్ ను నగరంలోని క్రషర్లకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. డీజిల్ ను మినీ ట్యాంకర్లకు నింపుతుండగా సీజ్ చేశారు. సీజ్ చేసిన బయోడీజిల్ విలువ సుమారు 15లక్షల ఉంటుందని పోలీసులు చెప్పారు. సీజ్ చేసిన వాహనాలను దుండిగల్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసును మేడ్చల్ సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.
►ALSO READ | పంచాయతీ సెక్రటరీ కేసు పెట్టిందని.. చెరువులో దూకి మహిళ ఆత్మహత్య