పంచాయతీ సెక్రటరీ కేసు పెట్టిందని.. చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

పంచాయతీ సెక్రటరీ కేసు పెట్టిందని.. చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ కేసు పెట్టిందని మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వచ్చి పట్టుకెళతారేమోనన్న భయంతో మనస్తాపం చెందిన మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.  పంచాయతీ సెక్రటరీ కేసు పెట్టడం వల్లే ఆమె చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.. వివరాల్లోకి వెళితే.. 

శుక్రవారం(సెప్టెంబర్12)  రాత్రి  మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లికి చెందిన కొండి లక్ష్మీ చెరువులో దూకి దళిత మహళఆత్మహత్య చేసుకుంది. గ్రామపంచాయతీ సెక్రటరీ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా కొండి లక్ష్మీ ఇంటిముందు చెత్త విషయంలో వాగ్వాదం ముదిరి ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లింది. 

►ALSO READ | పత్తిచేనులో గంజాయ సాగు...62లక్షల విలువ చేసే గంజాయి సీజ్

స్పెషల్ డ్రైవ్ లో భాగంగా కొండి అంజయ్య ఇంటిముందు ఉన్న చెత్తను తీసేయాలని అంజయ్య భార్యలక్ష్మీకి చెప్పారు..చెత్త విషయంతో వాగ్వాదం జరిగడంతో గ్రామపంచాయతీ సెక్రటరీ స్రవంతి ఫొటోలు తీస్తుండగా లక్ష్మీ అడ్డుకోవడంతో స్రవంతిచేతికి గాయమైంది.దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మనస్తాపానికి గురైన కొండి లక్ష్మీ శుక్రవారం రాత్రి ఊరి చివరలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  

లక్ష్మీ మృతికి కారణమైన పంచాయతీ సెక్రెటరీ స్రవంతి వచ్చే వరకు డెడ్ బాడీ చెరువు దగ్గర నుంచి తరలించేది లేదని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.