పత్తిచేనులో గంజాయ సాగు...62లక్షల విలువ చేసే గంజాయి సీజ్

పత్తిచేనులో గంజాయ సాగు...62లక్షల విలువ చేసే గంజాయి సీజ్

ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా గంజాయి సాగు జోరుగా సాగుతోంది. పత్తిచేనులో అంతరపంటగా గంజాయి సాగుచేస్తున్నారు. లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా గంజాయి సాగుచేస్తున్న చేస్తున్న ముగ్గురి వ్యక్తులపై కేసు నమోద చేశారు పోలీసులు.. వివరాల్లోకి వెళితే..

 ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామ శివారంలో పత్తిచేనులో అంతరపంటగా గంజాయి సాగుచేస్తున్న 627 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పట్టుకున్న గంజాయి విలువ మార్కెట్ లో రూ. 62లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి సాగుచేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాజిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్పారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలోఉన్నారు. 

గంజాయిసాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో అందరూ కలిసికట్టుగా గంజాయినిర్మూలనకు సహకరించాలని కోరారు. 

►ALSO READ | చందానగర్ లో బైక్ దొంగలు అరెస్ట్..14 బైకులు స్వాధీనం