భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ టికెట్ల కోసం ఆశావహులు గురువారం ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ నివాసానికి వెళ్లిన పలువురు తమకు టికెట్లు దక్కడం లేదంటూ ఆందోళన చేశారు. ఎమ్మెల్యే ముందే కోర్ కమిటీ సభ్యులను తమ మద్దుతుదారులతో కలిసి నిలదీశారు. ఎన్నో ఏండ్లుగా పార్టీ జెండా మోస్తున్నా తమకు టికెట్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
దీంతోవారిని పార్టీ పెద్దలు సముదాయించారు. టికెట్లు లిస్టులో మార్పులు చేసి, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని ఫైనల్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆశావహులు శాంతించారు.
