రూ.40వేల కోట్ల బ్యాంకురుణ కేసులో..RCom మాజీప్రెసిడెంట్ కు ఈడీ కస్టడీ 

రూ.40వేల కోట్ల బ్యాంకురుణ కేసులో..RCom మాజీప్రెసిడెంట్ కు ఈడీ కస్టడీ 

ప్రముఖ వ్యాపార వేత్త అనిల్​ అంబానీ గ్రూప్​ కంపెనీలకు చెందిన రూ.40వేల కోట్ల బ్యాంకు రుణా ఫ్రాడ్​ కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ () మాజీ ప్రెసిడెంట్ పునీత్​ గార్గ్​ కు ఢిల్లీ రౌస్​ అవెన్యూ కోర్టు 9రోజుల ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది. ఈ కేసులో గార్గ్​ ను గురువారం అరెస్ట్​ చేసిన  ఈడీ టాస్క్​ ఫోర్స్​.. ఇవాళ కోర్టులో హాజరుపర్చగా గార్గ్​ ను కస్టడీకి అనుమతించింది. RCom గ్రూప్​ సంస్థల నిధుల మళ్లింపు, మనీ లాండరింగ్​ లోగార్గ్​ పాత్ర ఉన్నట్లు ఈడీ ఆరోపించింది. 

రుణాలు మళ్లింపు ఇలా.. 

2013 ఏప్రిల్ నుంచి 2017 మార్చి మధ్య కాలంలో ఆర్‌కామ్ ,దాని గ్రూప్ సంస్థలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నుంచి కన్సార్టియం ,బ్యాంకింగ్ ఏర్పాట్ల కింద పెద్ద మొత్తంలో రుణాలు పొందాయని, బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించి నిధులను మళ్లించాయని సిబిఐ ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ వంటి ఇతర రుణదాతలు కన్సార్టియంలో ఉన్నారు. స్టాండర్డ్ చార్టర్డ్ ,హెచ్‌ఎస్‌బిసి వంటి ప్రైవేట్ రంగ రుణదాతలు, అనేక ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఇసిబి) రుణదాతలు కూడా రుణ ఏర్పాటులో భాగమయ్యారని అధికారులు తెలిపారు.

ఆర్​ కామ్​ కు చెందిన విదేశాల్లోని అనుబంధ సంస్థలకు , ఆఫ్​ షోర్​సంస్థ సంస్థల ద్వారా నిధులు మళ్లించారని ఈడీ ఆరోపించింది. ఆదాయంలోకొంత భాగాన్ని న్యూయార్క్​ లోని మాన్​ హాట్టన్​ లో ఓలగ్జరీ కండోమినియం ఆపార్టుమెంట్ కొనుగోలుకు ఉపయోగించారని కోర్టుకు తెలిపింది. 

బ్యాంకురుణాల మళ్లింపులో గార్గ్​ పాత్ర ఉందని.. దారిమళ్లించిన రుణాలలో కొంత భాగాన్ని గార్డ్​ తన వ్యక్తిగత ఖర్చులకు, పిల్లల విదేశీ విద్యకు వినియోగించారని దర్యాప్తు ఏజెన్సీ  కోర్టుకు తెలిపింది.