మేడారం దారిలో 8 కిలోమీటర్లు రాను.. పోను రూట్లు జామ్..మూడు వరుసల్లో నిలిచిన వెహికిల్స్

మేడారం దారిలో 8 కిలోమీటర్లు రాను.. పోను రూట్లు జామ్..మూడు వరుసల్లో నిలిచిన వెహికిల్స్
  • తిరుగు ప్రయాణంలో నెమ్మదిగా కదులుతున్న వాహనాలు
  • సమ్మక్క దర్శనానికి పోటెత్తిన భక్తులు
  • ట్రాఫిక్ కంట్రోలు పోలీసుల చర్యలు
  • భక్తులు సహకరించాలని రిక్వెస్ట్

ములుగు: గద్దెలపై కొలువు దీరిన వన దేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో మేడారం భక్తజన సంద్రంగా మారింది. మరో వైపు జాతరలో సమ్మక్కను దర్శించుకొని తిరిగి ఇండ్లకు వెళ్లే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది.దీంతో ఆ రూట్ కూడా బిజీగా మారింది. 

మేడారం దారిలో గోవిందరావుపేట మండలం పసరాలో ఇండియన్ పెట్రోల్ బంక్ నుంచి పసర ఆర్చ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తాడ్వాయి నుంచి మేడారం రూట్ లో సుమారు 8 కిలోమీ టర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి.

మూడు వరుసల్లో వాహనాలు నిలిచిపోవడంతో ఆర్టీసీ బస్సులు, ఇతర వెహికి ల్స్ స్లోగా వెళ్తున్నాయి. దీంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం చేస్తున్న వాహనాలతో పాటు మహా జాతరకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. 

పరిస్థితి చక్కదిద్దేందుకు పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టి వా హనాలను క్రమబద్ధీకరిస్తున్నా రు. భక్తులు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.