కాంగ్రెస్ లోనే ఉంటా..రాహుల్ పై శశిథరూర్ ప్రశంసలు: శశిథరూర్

కాంగ్రెస్ లోనే ఉంటా..రాహుల్ పై శశిథరూర్ ప్రశంసలు: శశిథరూర్

కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారనే ఊహాగానాలకు ఎంపీ శశిథరూర్ తెరదించారు. నిన్న పార్టీ ముఖ్యనేతలతో జరిగిన చర్చలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై ప్రశంలు కురిపించారు. దీనిలో భాగంగా శశిథరూర్ మాట్లాడుతూ.. తాను ఏపార్టీలోకి మారడం లేదని కుండ బద్దలు కొట్టారు. పార్టీ సిద్ధాంతాల పట్ట తాను విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. 

వచ్చే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాన ని వెల్లడించారు. యూడిఎప్ విజయం కోసం తాను కృషి చేస్తానని చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వ తీరును, పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర వంటి కార్యక్రమాల ద్వారా పార్టీని ప్రజల్లోకి బలంగా తీసు కెళ్తున్నారని వెల్లడించారు. రాహుల్ మతతత్వాన్ని వ్యతిరేకించే నాయకుడని ప్రశంసించారు. గతంలో తాను పార్టీ విషయంలో స్పందించిన తీరుపై స్పందించారు. పార్టీ వైఖరి తొలి పాధాన్యం అయినప్పటికీ తన వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించానని అన్నారు.