ఐటీ రైడ్స్ జరుగుతుండగానే..పిస్టల్ తో షూట్ చేసుకొని బిజినెస్ మ్యాన్ ఆత్మహత్య 

ఐటీ రైడ్స్ జరుగుతుండగానే..పిస్టల్ తో షూట్ చేసుకొని బిజినెస్ మ్యాన్ ఆత్మహత్య 

బెంగళూరులో దారుణం జరిగింది. ప్రముఖ రియల్​ ఎస్టేట్​ వ్యాపారి, బిజినెస్​ మ్యాన్​ సీజే రాయ్​ శుక్రవారం(జనవరి 30) ఆత్మహత్య చేసుకున్నాడు. తన కార్యాలయంలో పిస్టల్​ తో కాల్చుకొని చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. రాయ్​ ఆఫీసులో ఐటీ సోదాలు జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. 

విచారణలో భాగంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు కోరగా.. గదిలోకి వెళ్లిన రాయ్​ తన పిస్టల్​ తో కాల్చుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాయ్​ ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాయ్​ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. 

సీజే రాయ్​ ఆఫీసులో శుక్రవారం తెల్లవారుజామునుంచే ఐటీశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. రోజంతా జరిగిన ఈ రైడ్స్​లో రాయ్​ ని దర్యాప్తు అధికారులు విచారించారు. మధ్యాహ్నం3.15 గంటల సమయంలో రాయ్​ ని ఐటీ అధికారులు ప్రశ్నించే  సమయంలో ఈ ఘటన జరిగింది. విచారణ సమయంలో ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాలని కోరగా.. గదిలోకి వెళ్లిన రాయ్​ ..అక్కడే పిస్టల్​ తో షూట్ చేసుకున్నాడని అధికారులు తెలిపారు. 

రాయ్ గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే తుపాకీ పేలుడు శబ్దం వినిపించింది.. అతని ఛాతిపై బుల్లెట్ గాయాలున్నాయి. వెంటనే స్పందించిన ఐటీ అధికారులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాయ్​ చనిపోయాడని కమిషనర్​ సీమంత్​ కుమార్​ సింగ్​ తెలిపారు. 

గత మూడు రోజులుగా రాయ్​ ఆఫీసులు, ఇళ్లపై  కేరళ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాయ్​ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే కోణంగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.