నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తగా ఉండాలి : కలెక్టర్ కుమార్ దీపక్

నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తగా ఉండాలి : కలెక్టర్ కుమార్ దీపక్
  •     ఎన్నికల సిబ్బందికి అధికారుల ఆదేశం

లక్షెట్టిపేట, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. లక్సెట్టిపేటలోని పాత మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

నామినేషన్ కేంద్రాన్ని స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్ గంగాధర్, జాయింట్ కలెక్టర్ చంద్రయ్య సైతం  పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ఎంపీడీవో సరోజ ఉన్నారు.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు

కాగజ్ నగర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దని, నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ఆసిఫాబాద్​ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హరిత అధికారులకు సూచించారు. కాగ జ్ నగర్ లోని మున్సిపల్ ఆఫీస్​లో నామినేషన్ స్వీకరణను పరిశీలించారు. స్థానిక డీఏవీ స్కూల్​లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పకడ్బందీ భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ తనిఖీ చేశారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, సీఐ ప్రేమ్ కుమార్ ఉన్నారు.

ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

ఖానాపూర్, వెలుగు: మున్సిపల్ లో మున్సిపల్​ఎన్నికల ప్రక్రియను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ వీరా రెడ్డి సూచించారు. ఎంపీపీ కార్యాలయంలోని  నామినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ వేయడానికి వచ్చే వారికి ఎటువం టి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది సక్రమంగా పనిచేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహసీల్దార్ సుజాత రెడ్డి, ఎంపీడీవో రమాకాంత్ తదితరులున్నారు.