ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి : కలెక్టర్ రాజర్షి షా

ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదిలాబాద్​జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షి షా ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్​లో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాల సభ్యులకు నిర్వహించిన శిక్షణలో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు డి.హనుమంత్ నాయక్‌తో కలిసి పాల్గొని సూచనలు చేశారు. నగదు, మద్యం, బహుమతుల పంపిణీపై నిరంతర నిఘా ఉంచాలని, ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు.