
హైదరాబాద్ సిటీ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా సిటీలో పలు ప్రాంతాల్లో పార్క్ చేసి ఉన్న బైకులను కొట్టేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
నగరంలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం (సెప్టెంబర్12) చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడకు చెందిన నిందితులు సాయికుమార్ (21), సాయికిరణ్ (19) జల్సాలకు అలవాటుపడి బైక్ చోరీలకు పాల్పడుతున్నారు. చందానగర్, మియాపూర్, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ కాలనీ, గచ్చిబౌలి, సంగారెడ్డి టౌన్ పీఎస్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారినుంచి 14 బైకులను రికవరీ చేశారు.
►ALSO READ | కుషాయిగూడలో దారుణం..అందరూ చూస్తుండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య