
దారుణం..అందరూ చూస్తుండగానే వ్యక్తిపై కత్తితో దాడి..కిందపడి రక్తపు మడుగులో కొట్టుకుంటున్నా అదే పనిగా కత్తితో పొడిచి పొడి హత్య..దారుణం ఏంటని ప్రశ్నించిన స్థానికులు చంపేస్తానంటూ బెదిరింపులు.. హైదరాబాద్ సిటీ పరిధిలోని కుషాయిగూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కలకలం రేపుతోంది.
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపూర్ కాలనీలో శుక్రవారం( సెప్టెంబర్12) శ్రీకాంత్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురయ్యారు. కాలనీలో అందరూ చూస్తుండగానే కత్తితో పలుమార్లు పొడిచిపొడిచి హత్య చేశారు దుండగుడు. అనంతరం పారిపోతుండగా స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.
►ALSO READ | హైదరాబాద్ లో మ్యాట్రిమోనీ మాఫియా.. చాటింగ్ చేసి రూ. 25 లక్షలు దోచేశారు