
రోజురోజుకు కొత్త రకం సైబర్ మోసాలు బయటపడతున్నాయి. సైబర్ నేరగాళ్లు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆన్‌లైన్‌లో అందినకాడికి దోచుకుంటున్నారు. మ్యాట్రిమోనీ, వాట్సప్, టెలిగ్రామ్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వేదికగా ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ చేస్తున్నారు. నిరుద్యోగులు, యువత, ఐటీ ఉద్యోగులు, స్టూడెంట్స్, గృహిణులకు ఈజీమనీ ఆశగా చూపి మోసాలకు పాల్పడుతున్నారు.
సెప్టెంబర్ 12న హైదరాబాద్ లో మ్యాట్రిమోనీ ద్వారా బాధితుడి నుంచి 25 లక్షలు కాజేసిన ఇద్దరి వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోని ద్వారా చాట్ చేసి మోసం చేస్తోంది ఈ ముఠా. ఇన్‌స్టాగ్రామ్ ‘khoobsurat.rishte’ ఐడీతో పాకిస్తాన్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫోటోలు వాడి డబ్బులు వసూలు చేస్తున్నారు కేటుగాళ్ళు. ఇలా బాధితుడు నుంచి రూ. 25 లక్షలు కాజేశారు.
►ALSO READ | సద్గురు డీప్ ఫేక్ వీడియోతో.. భక్తురాలికి రూ. 3 కోట్ల 75 లక్షల టోకరా!
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ప్రధాన నిందితురాలు అనీసా మోహమ్మద్ యాసీన్,హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ ఆమర్ లను అరెస్ట్ చేశారు. మరో నిందితురాలు జోహర్ ఫాతిమా పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి 2 ఫోన్లు, లాప్‌టాప్, ట్యాబ్, బ్యాంక్ పాస్‌బుక్స్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితురాలి కోసం గాలిస్తున్నారు.