బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమకు వందల కోట్ల నష్టం!

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమకు వందల కోట్ల నష్టం!

హైదరాబాద్: బర్డ్ ఫ్లూ వల్ల రాష్ట్ర పౌల్ట్రీ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది. బర్డ్ ఫ్లూ వల్ల ఒక్క నెల వ్యవధిలో పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఏకంగా రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు నష్టం వాటిల్లి ఉండొచ్చునని సమాచారం. బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాజస్థాన్, మహారాష్ట్రతో పోలిస్తే తెలంగాణకు వచ్చిన నష్టం తక్కువేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా బర్డ్ ఫ్లూ వల్ల దేశవ్యాప్తంగా పౌల్ట్రీ పరిశ్రమకు రూ.3,400 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ ఇండస్ట్రీకి చెందిన ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో సగటున ఒక రోజుకు 2 కిలోల బరువున్న 7 లక్షల కోళ్లు అమ్ముడుపోతాయని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (ఎన్‌‌ఈసీసీ) బిజినెస్ మేనేజర్ సంజీవ్ చింతావర్ తెలిపారు. బర్డ్ ఫ్లూ కారణంగా లైవ్ చికెన్ కొనుగోళ్లు తగ్గిపోయాయన్నారు.