అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ ఆయన 95వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. అద్వానీ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అద్వానీ గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు పని చేశారు. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేశారని, కేంద్రమంత్రిగా ఉండి దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కేంద్ర మంత్రులు అమిత్ షా చెప్పారు. 

తెలంగాణ గవర్నర్ తమిళి సై కూడా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ గొప్ప జాతీయవాది అని ట్వీట్ చేశారు. 

ప్రస్తుత పాకిస్తాన్ లోని భాగమైన కరాచీలో 1927లో అద్వానీ జన్మించారు. చిన్న వయస్సులోనే ఆర్ఎస్ఎస్ లో చేరారు. ఆ తర్వాత జనసంఘ్ లో చేరి.. సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం మద్దతుగా 1990లో అద్వానీ ‘రథయాత్ర’ చేపట్టారు. వాజ్ పేయి హయంలో అద్వానీ కేంద్రహోం మంత్రిగానూ పని చేశారు. భారతీయ జనతా పార్టీ సహ వ్యవస్థాపకుల్లో అద్వానీ ఒకరు. 10వ లోక్ సభ, 14వ లోక్ సభ సమయాల్లో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.