కార్మిక నేత శోభన్​రెడ్డికి బర్త్​డే విషెస్

కార్మిక నేత శోభన్​రెడ్డికి బర్త్​డే విషెస్

హైదరాబాద్, వెలుగు : కార్మిక నేత మోతె శోభన్​రెడ్డికి గురువారం కార్మిక, విద్యార్థి, కాంగ్రెస్​నాయకులు, తార్నాక డివిజన్​ప్రజలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తార్నాకలోని ఇంటికి చేరుకుని శోభన్​రెడ్డిని గజమాలతో సన్మానించారు. అనంతరం డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డితో

కలిసి తార్నాకలోని డిప్యూటీ మేయర్‌ క్యాంప్‌ ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గోల్కొండలోని వేడుకలకు వెళ్లిన శోభన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.