అర్థరాత్రి కోర్టుకు బిట్టు శ్రీను.. రిమాండ్‌కు ఆదేశం

అర్థరాత్రి కోర్టుకు బిట్టు శ్రీను.. రిమాండ్‌కు ఆదేశం
  • కరీంనగర్ జైలుకు తరలింపు

పెద్దపల్లి: లాయర్లు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల హత్యలో ప్రధాన నిందితుడు బిట్టు శ్రీనివాస్ ను పోలీసులు అర్ధరాత్రి 12.05 గంటలకు మంథని కోర్టులో హాజరుపరిచారు. వామన్ రావు దంపతులను చంపడానికి కారు, కత్తులు బిట్టు శీను సమకూర్చాడు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్,  మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు మేనల్లుడు బిట్టు శ్రీనివాస్. తన తల్లి లింగమ్మ పేరుతో పుట్ట మధు ఏర్పాటుచేసిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టుకు బిట్టు శ్రీను చైర్మన్ గా ఉన్నాడు. పుట్ట లింగమ్మ ట్రస్టు సేవలపై ఆరోపణలు చేస్తూ సేవా కార్యక్రమాలు జరగకుండా తరచూ సోషల్ మీడియా లో పోస్టులు  పెడుతున్నందుకు వామన్ రావు, నాగమణి దంపతులపై బిట్టు శ్రీను కోపం పెంచుకున్నాడు. అంతే కాదు మంథని మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బేసిస్ క్రింద పారిశుద్ధ్యం తరలించే తన ట్రాక్టర్ ను మున్సిపాలిటీ కాంట్రాక్టు నుంచి తొలగించినందుకు వామన్ రావు పై కక్ష పెంచుకున్నాడు. గుంజపడుగు గ్రామంలో నిర్మిస్తున్న దేవాలయ వివాదం తోపాటు తన ఇంటి నిర్మాణంలో వివాదాలు, గొడవలు సృష్టిస్తూ తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నాడని మంథని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంటా శ్రీనివాస్ కూడా వామన్ రావును చంపాలని పగ పెంచుకున్నాడు. బిట్టు శీను కుంట శ్రీనివాస్ తో కలిసి 4 నెలల క్రితం వామన్ రావు దంపతుల హత్య కు ప్లాన్ వేసుకున్నారు. గత బుధవారం  లాయర్ దంపతులను కిరాతకంగా నడిరోడ్డుపై జనాలు చూస్తుండగానే హత్య చేశారు.  ప్రధాన నిందితుడ్ని అర్ధరాత్రి కోర్టులో హాజరుపరచగా.. మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండు ఆదేశించడంతో కరీంనగర్ జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి 

పక్షులకు కేరాఫ్ ఈ ఇల్లు

పన్నెండేళ్ల  పిలగాడు.. చిరుతతో ఫైటింగ్

సౌదీ చరిత్రలో మొదటిసారి.. ఆర్మీలోకి మహిళలు

గిరిసీమలో సేంద్రియ విప్లవం