
నవీపేట్, వెలుగు: నిజామాబాద్‌లో శుక్రవారం జరిగిన లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి అమ్ముడుపోకుండా ఉన్న నవీపేట్ ఒకటవ ఎంపీటీసీ మైస రాధ కాళ్లను బీజేపీ కార్యకర్తలు పాలతో కడిగారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తల్లి లాంటి పార్టీని వదిలి అధికార పార్టీకి అమ్ముడుపోయిన వైస్ ఎంపీపీ హరీశ్పోతంగల్, ఎంపీటీసీ రాజేశ్వర్ పై మండిపడ్డారు. సభ్యులను ప్రలోభ పెట్టి గెలవడం అంటే నైతికంగా ఓడిపోయినట్లే అన్నారు.