ఉప్పల్ కారిడార్ పేరుపై రచ్చ

ఉప్పల్ కారిడార్ పేరుపై రచ్చ
  • ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మ దహనం

ఉప్పల్, వెలుగు: ఉప్పల్​- -నారపల్లి ఎలివేటెడ్ కారిడార్​కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టాలన్న నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం బీజేపీ శ్రేణులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశాయి.

కేంద్ర నిధులతో జరుగుతున్న ఈ పనుల్లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎంపీ ఈటల రాజేందర్ కృషి ఎంతో ఉందని, వారు వాజ్​పేయి పేరును ప్రతిపాదించడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన తీరు మార్చుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.