
అంబర్ పేట, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు ఎం అనిల్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం అంబర్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో పదేళ్లు బీఆర్ఎస్, రెండేళ్లుగా కాంగ్రెస్ పాలనను ప్రజలు చూశారని, ఇక ఆ పార్టీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. సమావేశంలో సీనియర్ నాయకుడు మహేశ్ పాల్గొన్నారు.