మణిపూర్ అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర

మణిపూర్ అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర
  • మణిపూర్ అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర
  • మోదీ ఇంకా స్పందించపోవడం అత్యంత దారుణం 
  • సీపీఎం, సీపీఐ నేతల విమర్శ అల్లర్లకు నిరసనగా ప్రదర్శనలు

హైదరాబాద్, వెలుగు: మణిపూర్ లో అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర ఉందని సీపీఎం, సీపీఐ నేతలు ఆరోపించారు. ఆ రాష్ట్రం రావణకాష్ఠంగా మండుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ నోరు విప్పకపోవడం అత్యంత దారుణమని, దేశంలో మణిపూర్   అంతర్భాగం కాదా అని వారు మండిపడ్డారు. ‘మణిపూర్  అల్లర్లను అరికట్టండి. ప్రజల ప్రాణాలను కాపాడండి’ అనే డిమాండ్ తో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం లిబర్టీ నుంచి అంబేద్కర్  విగ్రహం వరకూ నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్  కె.నారాయణ మాట్లాడుతూ... మణిపూర్  చైన్ ద్వారా ఆయుధాలతో టెర్రరిస్టులు దేశంలోకి చొరబడుతున్నా కేంద్రం, మణిపూర్  బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. అల్లర్లను కట్టడికి ఇప్పటి వరకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. మణిపూర్ లో 54 వేల ఎకరాల భూమిని అదానీకి అప్పగించారని, అందుకే ఆ రాష్ట్రంలో  అల్లర్లను బీజేపీ  ప్రభుత్వం ప్రొత్సహిస్తుదని ఫైరయ్యారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మత ఘర్షణల ద్వారానే బీజేపీ ఎదుగుతున్నదన్నారు. 
 

ALSO READ :మార్కెట్​లో నకిలీ విత్తనాలు.. మొద్దు నిద్రలో ఆఫీసర్లు

ఆ రాష్ట్రంలో అల్లర్లు, హింస రాజకీయ ఎత్తుగడలో భాగమన్నారు. సమానత్వం పేరుతో యూసీసీని తెచ్చి హిందూ, ముస్లింల చిచ్చు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, తద్వారా హిందువుల  ఓట్లు తమకు పడతాయని బీజేపీ అనుకుంటున్నదని మండిపడ్డారు. ఈ ప్రదర్శనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి అజీజ్  పాషా, సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలు డీజీ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.