కవిత అరెస్టు కాకుండా కాపాడుతుంది బీజేపే: సామా రామ్మోహన్ రెడ్డి

కవిత అరెస్టు కాకుండా కాపాడుతుంది బీజేపే: సామా రామ్మోహన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించారో ప్రభాకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకుండా బీజేపీ కాపాడుతున్న తీరును తెలంగాణ సమాజం చూస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని పదే పదే విమర్శిస్తున్న బీజేపీ అగ్ర నేతలు...ఇందులో జరిగిన అవినీతిపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ..రెండూ తెలంగాణకు ద్రోహం చేశాయని మండిపడ్డారు.