వడ్లు ఎప్పటికప్పుడు కాంటా వేయాలి : బీజేపీ కిసాన్ మోర్చా

వడ్లు ఎప్పటికప్పుడు కాంటా వేయాలి : బీజేపీ కిసాన్ మోర్చా

ఆర్మూర్, వెలుగు: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను ఎప్పటికప్పుడు కాంటా వేయాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్​జిల్లా ఆర్మూర్​తహసీల్దార్ ఆఫీస్​ముందు ధర్నా చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి తరుగు లేకుండా వడ్లు తూకం వేయాలని, ఇప్పటివరకు తీసిన 8 నుంచి 12 కిలోల వడ్లు తరుగు మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేయాలని డిమాండ్​చేశారు.

కేంద్రాల్లో లారీలను అందుబాటులో ఉంచి, సరిపోయే గన్నీ బ్యాగులను  తెప్పించాలని, హమాలీల సమస్య పరిష్కరించాలని కోరారు. తహసీల్దార్​కు మోమోరాండం అందజేశారు. మోర్చా టౌన్ ప్రెసిడెంట్​శేషగిరి లింగం, బీజేవైఎం టౌన్​ప్రెసిడెంట్​ఉదయ్ గౌడ్, నాయకులు భాజన్న, కిరణ్, పోశెట్టి, భూపతి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.