భారత్​లోనే యూత్​ ఎక్కువ.. వారి కోసం అవకాశాలు ఎదురు చూస్తున్నాయ్​..: కిషన్​రెడ్డి

భారత్​లోనే యూత్​ ఎక్కువ..  వారి కోసం అవకాశాలు ఎదురు చూస్తున్నాయ్​..: కిషన్​రెడ్డి

భారత్​లోనే యువత ఎక్కువగా ఉందని.. వారి కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు.  జులై 22న సికింద్రాబాద్​ బోయిగూడా రైల్​కళారంగ్​లో రోజ్​గార్​మేళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్​ గెస్ట్ గా హాజరైన ఆయన యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. 

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. దేశ యువ శక్తిని ఒడిసి పడితే అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ఇస్తున్నామని పేర్కొన్నారు.  

తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.  తాను రైతు కుటుంబం నుంచి వచ్చి.. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగినట్టు గుర్తు చేశారు.