నీతిఆయోగ్ లో KCR పాల్గొనకపోవడం.. రాష్ట్ర ప్రజల దురదృష్టకరం : లక్ష్మణ్

నీతిఆయోగ్ లో KCR పాల్గొనకపోవడం.. రాష్ట్ర ప్రజల దురదృష్టకరం : లక్ష్మణ్

హైదరాబాద్ : నీతిఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొనకపోవడం.. రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఆదివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బంగారు తెలంగాణ అని చెప్పి బాధల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రారంభానికి మోడీని పిలవాలనే సోయి కేసీఆర్ కు లేదా అని ప్రశ్నించారు.  ఫీజుల నియంత్రణ, నిరుద్యోగ సమస్యలపై త్వరలో పోరాటం ప్రారంభిస్తామన్నారు లక్ష్మణ్.